మోదీ–ట్రంప్​ బంధం బలోపేతం

అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి

Jan 9, 2025 - 19:00
 0
మోదీ–ట్రంప్​ బంధం బలోపేతం

వాషింగ్టన్​: డోనాల్డ్​ ట్రంప్​, ప్రధాని మోదీల మధ్య స్నేహబంధం బలంగా ఉందని అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్​ ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం అందించారా? అనే విషయం తనకు తెలియదన్నారు. అయితే తొలిసమావేశం ట్రంప్​–మోదీల మధ్యే జరగాలని తాను భావిస్తున్నట్లు ఎరిక్​ ఆకాంక్షించారు. భారత్​–యూఎస్​ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పని అన్నారు. ఇరుదేశాల మధ్య అనేక ఒప్పందాలు భాగస్వామ్యం మరింత పటిష్టం అవుతుందన్నారు. వచ్చే వారం బెంగళూరులో నూతన కాన్సులేట్​ ను ప్రారంభిస్తామన్నారు. భారత్​  ఆశావాదం, పురోగతి తనకు సంతోషాన్ని కలిగిస్తుందని ఎరిక్​ గార్సెట్టి అన్నారు.