చత్తీస్ గఢ్ లో కూలిన చిమ్ని.. శిథిలాల కింద 25 మంది
Chimney collapsed in Chattisgarh.. 25 people under the rubble
పెద్ద ఎత్తున రంగంలోకి రెస్క్యూ బృందాలు
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ ముంగేలి జిల్లా నిర్మాణంలో ఉన్న కుసుమ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలో భారీ చిమ్నీ కూలిపోయి 25 మంది దాని కింద చిక్కుకున్నారు. గురువారం ఈ ఘటన ముంగేలి జిల్లాలోని సర్గాల్ రాంబోడ్ లో జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు గ్రామస్థులతో కలిసి రెస్క్యూ చర్యలు చేపట్టి అధికారులకు సమాచారాన్ని అందజేశారు. పలువురు గాయపడ్డవారిని శిథిలాల నుంచి రక్షించి బిలాస్ పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ పైప్ లైన్ నిర్మాణం సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. విషయం తెలుసుకున్న అధికారులు బిలాస్ పూర్, పెండ్రా, రాయ్ ఘర్, జంజ్ గిర్ చంపా జిల్లాల నుంచి విపత్తు, నిర్వహణ బృందాలు భారీ ఎత్తున రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై సర్గావ్ పోలీసులు కేసు నమోదు చేపట్టినట్లు ఎస్పీ భోజరాజ్ పటేల్ విచారణ చేపట్టారు. ఈ ప్లాంట్ లో ఇనుప పైపులు తయారు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కూలీలంతా భోజనం చేస్తున్నట్లు తెలిపారు.