కాలిఫోర్నియా కార్చిచ్చు 28వేల ఇళ్లు దగ్ధం
California fire burns 28,000 homes
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలో గత మూడు రోజులుగా రగులుతున్న కార్చిచ్చు వల్ల 28వేల ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ మంటలు గురువారం నాటికి లాస్ ఏంజెల్స్ వరకు వ్యాపించాయి. ప్రముఖ హాలీవుడ్ తారల ఇళ్లు కూడా ఈ కార్చిచ్చులో కాలి బూడిదయయాయి. ఉప రాష్ర్టపతి కమలా హారీస్ బ్రెట్టన్ వుడ్ ఇంటిని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. 4,856 హెక్టార్లలో అగ్ని ప్రమాదం వల్ల 1100 భారీ భవనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా 50వేలమందిని అధికారులు ఇళ్ల నుంచి సురక్షితంగా తరలించారు. మూడు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రముఖ నటులు ఉన్నఫళంగా తమ తమ ఇళ్లను వదిలివెళ్లారు. మరోవైపు కార్చిచ్చును ఆపేందుకు అధికారులు పెద్ద యెత్తున చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు.