ఫైరింగ్​ రేంజ్​ లో ప్రమాదం బాంబు పేలి ఇద్దరు జవాన్లు మృతి

Two jawans were killed when a bomb exploded in the firing range

Dec 18, 2024 - 14:56
 0
ఫైరింగ్​ రేంజ్​ లో ప్రమాదం బాంబు పేలి ఇద్దరు జవాన్లు మృతి

జైపూర్​: రాజస్థాన్‌లోని బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్​ ట్రైనింగ్​ సమయంలో ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో బాంబు పేలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని నార్త్ క్యాంప్‌లోని చార్లీ సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైనికుడిని సూరత్‌గఢ్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందజేస్తున్నారు. తప్పిదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.