మహానీయుడి బలిదానం ఊరికే పోదు

శ్యామ ప్రసాద్​ ముఖర్జీ బలిదాన్​ దివస్​ లో ప్రధాని మోదీ

Jun 23, 2024 - 13:15
 0
మహానీయుడి బలిదానం ఊరికే పోదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీం: శ్యామ ప్రసాద్​ ముఖర్జీ దేశ హితం కోసం పనిచేసిన గొప్ప మహానీయుడని, ఆయన బలిదానం ఊరికే పోదని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సేవలను కొనియాడారు. ఆదివారం శ్యామ ప్రసాద్​ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యత్​ తరాలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. దేశానికి గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు, విద్యావేత్త అని కొనియాడారు. భారతమాత సేవలో తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం ప్రతీఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.