సిద్ధిఖీ అంత్యక్రియలు పూర్తి
Siddiqui's last rites are complete
ముంబాయి: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖీ అంత్యక్రియలు ఆదివారం రాత్రి ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఈయన అంతిమ యాత్రకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. ముంబాయిలోని మెరైన్స్ లైన్స్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్మశాన వాటిలో వారి సాంప్రదాయం మేరకు నిర్వహించారు. అయితే పోలీసులు స్మశాన వాటిక వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. సిద్ధిఖీకి కడసారిగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాళులర్పించారు.
సల్మాన్, షారూఖ్ ల వివాదాన్ని సిద్దిఖీ సద్దు మణిగింప చేయడంలో ముఖ్యపాత్ర వహించారు. అప్పటి నుంచి సల్మాన్ ఈయనకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేర్కొంటారు. మరోవైపు దావూద్, సల్మాన్ లకు సహకరించిన ప్రతీ ఒక్కరిని చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఇతని గ్యాంగ్ లో 700మంది వరకు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.