జీడీపీ వాస్తవ వృద్ధి 7.2 శాతం

ఎంపీసీ సమావేశం నిర్ణయాలను వెల్లడించిన శక్తికాంతదాస్​

Oct 9, 2024 - 15:16
Oct 9, 2024 - 15:33
 0
జీడీపీ వాస్తవ వృద్ధి 7.2 శాతం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25  ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. బుధవారం ఎంపీసీ (మానిటరింగ్​ పాలసీ కమిటీ–ద్రవ్య విధాన కమిటీ) ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఆధ్వర్యంలో భేటీ అయింది. సమావేశం అనంతరం శక్తికాంత దాస్​ మీడియాకు వివరాలను అందించారు. 
 
క్యూ2లో జీడీపీ వృద్ధి 7శాతంగా ఉంటుందని, క్యూ3, క్యూ4 రెండింటిలోనూ 7.4 శాతానికి పెరుగుతుందని తెలిపారు.  వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–-26 మొదటి త్రైమాసికంలో, వివిధ ఆర్థిక సూచికలలో రిస్క్‌లు సమానంగా సమతుల్యతతో, వృద్ధిని 7.3 శాతంగా అంచనా వేశామన్నారు. ప్రైవేట్​ రంగం, దేశంలో పెట్టుబడుల కారణంగా వృద్ధి రేటు బలంగా ఉంటుందన్నారు. పారిశ్రామిక, సేవల రంగాలలో పటిష్టమైన కార్యాచరణ కారణంగా స్థూల విలువ జోడింపు 6.8శాతంగా వృద్ధి చెందిందన్నారు. ఇది జీడీపీ అంచనాలను అధిగమించిందన్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధికి సంబంధించిన స్థూల ఆర్థిక సమతుల్యాన్ని ఎంపీసీ సమావేశం అంగీకరించిందని, అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం కూడా లేకపోలేదన్నారు. సెప్టెంబర్​ లో ద్రవ్యోల్బణం తిరోగమించవచ్చన్నారు.
ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతం..
అదే సమయంలో ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం ఉంచాలని ఎంపీసీ కమిటీ నిర్ణయించింది. వడ్డీ రేటు యథాతథంగా ఉంచాలని ఐదుగురు సభ్యులు తమ మద్ధతు తెలిపారని శక్తికాంత దాస్​ చెప్పారు. ఎస్డీఎఫ్​ (స్టాండింగ్​ డిపాజిట్​ సౌకర్యం) 6.25 శాతం, స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్​ఎఫ్​) రేటు, బ్యాంక్ రేటును 6.75శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించారు.