ట్రంప్ హెచ్చరిక బేఖాతర్
Trump's warning Bekhatar
మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీల మృతదేహాలు లభ్యం
జెరూసలేం: బందీలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు చేసిన హెచ్చరికల మరుసటి రోజే బందీలలో యూసఫ్ అల్ జదానీ (53) మృతదేహం లభ్యంకావడం ఇజ్రాయెల్ లో కలకలం రేపుతుంది. ఈయన మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సంతాపం వ్యక్తం చేశారు. ఇతనితోపాటు జదానీ కుమారుడి మృతదేహం కూడా లభ్యమైంది. హమాస్ వద్ద ఉన్న వందమంది బంధితులు సజీవంగా ఉండకపోవచ్చనే అనుమానాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కనీసం 50 మంది బతికే ఉన్నారని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తుంది. అయితే లభించిన మృతదేహాలు ట్రంప్ హెచ్చరిక తరువాతనే వీరిని చంపినట్లుగా తెలుస్తుందని అధికారులు గుర్తించారు.
2023 నవంబర్ లో జరిగిన హమాస్ మారణకాండలో 1200మంది మృతిచెందారు. అటుపిమ్మట ఇజ్రాయెల్ దాడుల్లో 50వేలమందికి పైగా పాలస్తీయన్లు, గాజా, హమాస్, లెబనాన్ లోని ప్రజలు, ఉగ్రవాదులు చనిపోయారు. ఆయా ప్రాంతాలు పూర్తిగా భస్మిపటలం అయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలు నివాస యోగ్యంగా లేవు. ఇటీవల యూఎన్ నేతృత్వంలో జరిగిన చర్చల్లో యుద్ధం ముగించాలని ఇజ్రాయెల్, హమాస్ లు నిర్ణయించాయి. కానీ ఇరువురు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.