ట్రంప్ విజయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్
Trump's victory boosted the stock markets
ముంబాయి: ట్రంప్ విజయంతో భారత స్టాక్ మార్కెట్లలో భారీ వృద్ధి నమోదైంది. సెన్సెక్స్ 901, నిఫ్టీ 270 పాయింట్ల జంప్ తో ముగిసింది. బుధవారం ముగింపు దశలో సెన్సెక్స్ 901.50 పాయింట్లో 80,378.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 270.75 పాయింట్ల లాభంఓ 24,484.05 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీషేర్లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. సెన్సెక్స్ లోని 30 సంస్థల్లో 25 షేర్లు లాభాల్లో ముగియగా ఐదు సంస్థలు మాత్రం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో 50 సంస్థల్లో 41 సంస్థలు లాభాను సాధించగా, 9సంస్థలు నష్టాలను చవిచూశాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లలో స్వల్ప క్షీణత నమోదైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, రిలయన్స్, ఎన్టీపీసీ లు లాభాలను సాధించాయి.