యెమెన్ లో పడవ బోల్తా.. 49 మంది మృతి
140 మంది ఆచూకీ గల్లంతు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యెమెన్ అడెన్ సముద్ర తీరంలో వలసదారుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది మృతి చెందినట్లు 140 మంది ఆచూకీ తెలియరాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలసదారులంతా హార్న్ ఆఫ్ ఆఫ్రిగా నుంచి వస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆచూకీ అయిన వారికోసం వెతికుతున్నామని పేర్కొన్నారు. వలసదారులతో కూడిన పడవ ఏడెన్ కు తూర్పున ఉన్న షాబ్వా ప్రావిన్స్ తీరానికి చేరుకునేలోపే మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన లెక్కల ప్రకారం 97వేల మంది వలసదారులు యెమెన్ లో ఆశ్రయం పొందుతున్నారు.
ప్రతీయేటా ఆఫ్రికా నుంచి వలసవెళుతున్న వారు సౌదీ అరేబియాకు చేరుకునేందుకు ముందుగా యెమెన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి తూర్పు మార్గం గుండా ఎర్రసముద్రం దాటి సౌదీకి చేరతారు. ఈ ప్రయాణంలో తీవ్ర ఆటంకాలున్నప్పటికీ వలసదారులు ప్రయత్నాలు మానడం లేదు. ఇందుకు ఆఫ్రికాలో ఉపాధి లభించకపోవడమేనని పలుమార్లు ఐక్యరాజ్యసమితి కూడా వెల్లడించింది.