బారాముల్లాలో త్రికోణ పోటీ

Triangular contest in Baramulla

May 19, 2024 - 20:36
 0
బారాముల్లాలో త్రికోణ పోటీ

జమ్మూకశ్మీర్​: బారాముల్లాలో మే 20న (సోమవారం) పోలింగ్​ జరగనుంది. ఈ స్థానంలో బీజేపీ ఎన్నికలకు దూరంగా ఉన్నా త్రీకోణ పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి నేషనల్​ కాన్ఫరెన్స్​ నుంచి ఫరూక్​ అబ్దుల్లా కుమారుడు ఒమర్​ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్​ పార్టీ (పీడీపీ) ఫయాజ్​ మీర్​, జమ్మూకశ్మీర్​ పీపుల్స్​ కాన్ఫరెన్స్​ పార్టీ (జేకేపీసీపీ)ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. 

వీరుగాక ఈ స్థానం నుంచి అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఈపీ) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్, వేర్పాటువాద నాయకుడు నయీమ్ అహ్మద్ ఖాన్ సోదరుడు మునీర్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మే 20న జరగనున్న ఎన్నికల కోసం 2,103 పోలింగ్​ స్టేషన్లుండగా 17.37 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.