నేటి నుంచే సీఐఎస్ఎఫ్ చేతిలో పార్లమెంట్ భద్రత
The security of Parliament is in the hands of CISF from today
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ భద్రత సోమవారం (మే 20)నుంచి సీఐఎస్ఎఫ్ చేతిలోకి వెళ్లనుంది. పార్లమెంట్ భద్రత కోసం 1,400మంది భద్రత కోసం మోహరించనున్నారు. మొత్తం షిఫ్టుల వారీగా 3,300మంది భద్రతను పర్యవేక్షించనున్నారు. మరోవైపు పార్లమెంట్ నుంచి భద్రతను పీడీజీ (పార్లమెంట్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్)ఉపసంహరించుకోనుంది. శుక్రవారం నుంచే పీడీజీ భద్రతను ఉపసంహరించుకుంది. శనివారం, ఆదివారాలు సెలవులు కావడంతో సోమవారం నుంచి భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షించనుంది. అధికారికంగా పీడీజీ సీఐఎస్ఎఫ్ కు బాధ్యతలను అప్పగించింది. కాగా భద్రతా విషయంలో పీడీజీ అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా సీఐఎస్ ఎఫ్ భద్రత ఉండనుంది.
2023 డిసెంబర్ 13న జీరో అవసర్ సమయంలో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోకి చొరబడి స్మోక్ బాంబులు విసిరి నినాదాలు చేయడంతో పార్లమెంట్ భద్రతపై పలు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై భద్రతపై పలు దఫాలు సమావేశాలు నిర్వహించి సీఐఎస్ఎఫ్ కు భద్రతను అప్పగించాలని నిర్ణయించింది.
సీఎస్ఎఫ్ సిబ్బందికి బ్యాగేజీ చెకింగ్, పర్సనల్ సెర్చ్, పేలుడు పదార్థాలను గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం, పార్లమెంట్ సభ్యులతో ప్రవర్తించే తీరు ఇలా పలు రకాలుగా శిక్షణ నిచ్చారు. భద్రత కోసం ఇటీవలే ఎన్ ఎస్ జీ కమెండోలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.