వారసత్వం, ప్రజల పట్ల గౌరవం తల్లి, సోదరి నేర్పారు

డెమోక్రాట్​ అభ్యర్థి కమలా హారీస్​

Nov 3, 2024 - 14:22
 0
వారసత్వం, ప్రజల పట్ల గౌరవం తల్లి, సోదరి నేర్పారు

వాషింగ్టన్​ డీసీ: అమ్మ, సోదరి ప్రతీయేటా దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు భారత్​ కు వెళ్లేవారని వారు నాకు వారసత్వం పట్ల, ప్రజల పట్ల గౌరవం, మర్యాదలను నేర్పించారని అదే విధానంలో తాను నడుస్తున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న డెమొక్రట్​ అభ్యర్థి కమలా హారీస్​ అన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఒటింగ్​ ప్రారంభం కాగా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగించారు. భారత్​ తో తనకు, తన కుటుంబానికి ఉన్న జ్ఞాపకాలను నెమరువేస్తూ భారతీయుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. భారత్​ కు వెళ్లినప్పుడు తమ తాత, బంధువులతో సమయం గడిపేవారిమని చిన్ననాటి జ్ఞాపకలను వివరించారు. తన నివాసంలో దీపావళి వేడుకలను నిర్వహించడం తనకు ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. కమలా తల్లి శ్యామల హ్యారీస్​ 19యేళ్ల వయసులో భారత్​ నుంచి అమెరికాలో స్థిరపడిందన్నారు. అప్పుడు తన తల్లిముందు ఇద్దరు కూతుర్లను పెంచే పెద్ద లక్ష్యం ఉందన్నారు.