నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యాక్ట్ ఈస్ట్ విధాంలో భారత్–సింగపూర్ ల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని రణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం భారత పర్యటనలో ఉన్న సింగపూర్ ప్రతినిధి బృందానికి మంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత్–సింగపూ ప్రతినిధుల మధ్య శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. సింగపూర్ రక్షణ మంత్రి డా. ఎన్‌జి. ఎంగ్ హెన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆరోసారి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
సమావేశం అనంతరం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ పాలసీని ప్రపంచం గుర్తిస్తుందన్నారు. భారత్ – సింగపూర్ ఆర్థిక సహకారం, సాంస్కృతిక, వ్యూహాత్మక బంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సింగపూర్ మంత్రి మాట్లాడతూ.. భారత్ ఎన్నటికీ సింగపూర్ కు మిత్రత్వ దేశమే అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు రోజురోజుకు ఇనుమడించడం సంతోషకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటనకు కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలోని నిర్ణయాలు..
ఇరుదేశాల రక్షణ దళాలు సంయుక్తంగా విన్యాసాలను నిర్వహించడం, సముద్ర శాంతికి ఇరుదేశాలు కలిసి పనిచేయడం, తరచూ ఇరుదేశాల నౌకలలో భద్రతను పర్యవేక్షించడం వంటి వాటిని చేపట్టనున్నారు.