బంగ్లాలో మళ్లీ ఆందోళనలు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా

Resignation of Chief Justice causes agitation in Bengal again

Aug 10, 2024 - 16:19
 0
బంగ్లాలో మళ్లీ ఆందోళనలు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా

ఢాకా: బంగ్లాదేశ్​ లో విద్యార్థుల ఆందోళన, డిమాండ్​ తో సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​ ఒబెదుల్​ హసన్​ రాజీనామ సమర్పించారు. ఈయన మాజీ ప్రధానమంత్రి షేక్​ హసీనాకు అనుకూలురుగా ముద్ర పడడంతో విద్యార్థులు ఈయన రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. 

శనివారం సీజేఐ సహా పలువురు న్యాయమూర్తులు రాజీనామా చేయాలని విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టును ముట్టడించారు. ఒక గంటలో రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీంతో సుప్రీం కోర్టు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో బంగ్లాదేశ్​ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒబెదుల్​ హసన్​ కోర్టును వీడి వెళ్లిపోయారు. 

వందలాదిగా విద్యార్థులు సుప్రీంకోర్టును చుట్టుముట్టడంతో పోలీసులు న్యాయమూర్తి ఒబెదుల్​ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

నూతన ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రధాన న్యాయమూర్తి కోర్టు సమావేశం ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఆందోళనల వెనుక కూడా కుట్ర కోణం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 
అనంతరం న్యాయమూర్తి ఒబెదుల్​ హసన్​ రాజీనామా ప్రకటన వెలువడింది.