ఏఐఐబీ ద్వారా ఆర్థిక సహాయం చేయాలి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​

Sep 25, 2024 - 18:32
 0
ఏఐఐబీ ద్వారా ఆర్థిక సహాయం చేయాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ద్వారా ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. బుధవారం ఏఐఐబీ సమర్​ కండ్​ (ఉబ్జెకస్తాన్​)లో జరిగిన 9వ వార్షిక బోర్డ్​ ఆఫ్​ గవర్నర్​ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏఐఐబీ అధ్యక్షుడు జిన్​ లికున్​ కు సహాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలో రుణ కార్యకలాపాలు వేగంగా వృద్ధి చెందాయని మంత్రి ప్రశంసించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను ఏఐఐబీ ప్రోత్సహించడాన్ని అభినందించారు. ఏఐఐబీ భారత్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశాలను అన్వేషించాలని మంత్రి నిర్మలా సీతారామన్​ ఆకాంక్షించారు.