రెస్టారెంట్లపై  పేర్ల ప్రదర్శన

Display of names on restaurants

Sep 25, 2024 - 18:15
 0
రెస్టారెంట్లపై  పేర్ల ప్రదర్శన

షిమ్లా: హిమాచల్​ ప్రదేశ్​ లో ఉన్న రెస్టారెంట్లపై యాజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం కాంగ్రెస్ పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ విలేకరులతో అన్నారు. యూపీ యోగి సర్కార్​ మాదిరి ఇక్కడ తీసుకున్న చర్య చర్చనీయాంశంగా మారింది. పేర్ల ప్రదర్శనలో ఏవైనా సమస్యలు తలెత్తితే పారదర్శకంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు. జనవరి నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశామన్నారు. పేర్ల ప్రదర్శనల అనంతరం గుర్తింపు కార్డులను కూడా జారీ చేయనున్నట్లు తెలిపారు. ఫుడ స్టాళ్లలో ఆహార నాణ్యతపై సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో వివిధ రకాల భయాలను తొలగిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రతీఒక్క రెస్టారెంట్​ యాజమాని అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి విక్రమాదిత్య తెలిపారు.