మతమార్పిళ్లపై రాజస్థాన్ చట్టం
సుప్రీం సూచనలు, సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం
జైపూర్: రాజస్థాన్ లోని భజన్ లాల్ ప్రభుత్వం మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తీసుకురానుంది. మతమార్పిళ్లపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం ఈ విషయాన్ని సీఎంకు అత్యంత సన్నిహితులైన నాయకులు వివరించారు. సుప్రీం సూచన మేరకు చట్టం మార్గదర్శకాలను రూపొందించి చట్టాన్ని ఆమోదించేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఖచ్చితంగా మతమార్పిళ్లపై చట్టం తీసుకువచ్చిన తొలి రాష్ర్టంగా రాజస్థాన్ నిలుస్తుందన్నారు. కాగా 2006లో వసుంధర రాజే ప్రభుత్వంలోనే మతమార్పిళ్లపై అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చేందుకు అసెంబ్లీ, రాజ్యసభల్లో ఆమోదం లభించింది. పార్లమెంట్, రాష్ర్టపతిలు ఈ చట్టాన్ని ఆమోదించకపోవడంతో మతమార్పిడి చట్టం బిల్లు నిలిచిపోయింది.