రతికకు టైమ్ వచ్చింది
బిగ్‌బాస్-బ్యూటీ-రతిక-రోజ్-గురించి-ప్రత్యేకంగా-చెప్పాల్సిన-పని-లేదు.
బిగ్‌బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. నెగిటివిటీతో మరింత ఫేమ్ దక్కించుకుంది. ఓ వైపు పల్లవి ప్రశాంత్.. మరోవైపు యావర్‌తో లవ్ ట్రాక్ నడిపించినట్లే నడిపి హౌస్‌లో కొనసాగింది. ఇక బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే.. ఫస్ట్ నుంచి సినిమాల్లో ట్రై చేస్తున్న బ్యూటీకి ప్రజెంట్ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్నాడు.. వరుస సినిమాలు ప్రస్తుతం ఉన్నాడు. అయితే.. ఇప్పుడు విజయ్‌కి సంబంధించిన ఓ సినిమాలో రతిక రోజ్‌కు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. 'విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు.. మంచి పాత్రలు రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈ వినియోగించుకో రతిక' అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నెటిజన్లు. అయితే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.