ఉపాధ్యాయులకు ఆర్టీసీ డిపో మేనేజర్​ సన్మానం 

RTC Depot Manager felicitates teachers

Sep 5, 2024 - 20:03
 0
ఉపాధ్యాయులకు ఆర్టీసీ డిపో మేనేజర్​ సన్మానం 

నా తెలంగాణ, నిర్మల్​: ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులను డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి పుష్పాలు ఇచ్చి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉపాధ్యాయులను శాలువాలు కప్పి సత్కరించారు. మీరంతా మన బసులో ప్రయాణిస్తూ స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మంచి భవిష్యత్తును అందచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి నిర్మల్ బస్టాండ్ నుంచి వివిధ పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులను మేనేజర్​ ప్రతిమా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్, స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.