ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
Grand Hanuman Shobhayatra
నా తెలంగాణ,రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది.శోభాయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు కషాయం జెండాలతో నృత్యాలు చేయగా భజనలు,కీర్తనలు,కోలాటాలు,డీజే పాటలు శోభాయాత్రలో ఆకట్టుకున్నాయి. యువకులతో పాటు మహిళలు జై హనుమాన్, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర జరిగింది