థగ్ ఆఫ్ లైఫ్...తగ్గేది లే

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాతో చాలా కాలం తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Apr 20, 2024 - 16:19
 0
థగ్ ఆఫ్ లైఫ్...తగ్గేది లే

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాతో చాలా కాలం తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విక్రమ్‌ ఇచ్చిన సక్సెస్ కిక్ తో వరుసగా సినిమాలకు కమల్‌ కమిట్ అయ్యాడు. అందులో మణిరత్నం దర్శకత్వంలో 'థగ్‌ లైఫ్' ఒకటి.

కమల్‌, మణిరత్నం కాంబోలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మరియు జయం రవితో పాటు ఇటీవలే ఈ సినిమాకి శింబు ఓకే చెప్పాడనే వార్తలు వచ్చాయి. 

ఇక ఈ సినిమా రిలీజ్ విషయమై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాదిలోనే థగ్స్ లైఫ్‌ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం థగ్‌ లైఫ్ ను విడుదల చేయడానికి ఇంకా చాలా సమయం కావాలట. మేకింగ్ కు ఆరు ఏడు నెలల సమయం కావాలని, అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ కి కూడా చాలా ఎక్కువ సమయం కావాల్సి ఉంటుందట. థగ్‌ లైఫ్‌ ను 2025 సమ్మర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మణిరత్నం గత చిత్రం పొన్నియిన్ సెల్వన్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో థగ్‌ లైఫ్‌ పై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. కమల్‌ సినిమాకు తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది కూడా మణిరత్నం సినిమా అవ్వడంతో థగ్‌ లైఫ్ కి టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి క్రేజీ మూవీ వచ్చే సమ్మర్‌ లో రానున్న నేపథ్యంలో ఏ తెలుగు సినిమా కు ఈ సినిమా పోటీ అవుతుంది అనేది ఇప్పటి నుంచే ఆసక్తికర చర్చ మొదలైంది.