అందరూ మెచ్చే "డార్లింగ్"

ప్రియదర్శి, నభా నటేష్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిరంజన్ రెడ్డి.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Apr 20, 2024 - 16:14
 0
అందరూ మెచ్చే "డార్లింగ్"

ప్రియదర్శి, నభా నటేష్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిరంజన్ రెడ్డి.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. రాఘవ్, ఆనంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తారని గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

డార్లింగ్ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సబ్ టైటిల్ లో క్రేజీగా వై దిస్ కొలవెరి అంటూ రాసుకొచ్చారు మేకర్స్. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్, ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. నభా నటేష్‌ కు ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ చేస్తున్నట్లు ఉన్న ఫస్ట్‌ లుక్ పోస్టర్ సూపర్ గా ఉంది. భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ఈ మూవీ స్టోరీగా ఉండనున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది. సెలూన్‌ లో ప్రియదర్శి, బార్బర్ మధ్య ఫన్నీ సంభాషణతో ప్రోమో స్టార్ట్ అయ్యింది. అప్పుడు దర్శి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంది. ఆడవాళ్ళు తల్లులుగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారని.. సిస్టర్లుగా ఉన్నప్పుడు అండగా, రక్షణగా ఉంటారని చెప్పారు. అదే అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు, క్యూట్‌ గా బబ్లీగా ఉండి మనల్ని చాలా అర్థం చేసుకుంటుందని.. కానీ ఆ పిల్లే పెళ్ళాం అయితే.. జిందగీ అంతా తలకిందులు చేసి.. మొగుడు తాట తీసి తందూరి వండుకుని తింటారు అన్నా.. అంటూ ప్రియదర్శి నవ్వులు పూయించారు.