సయేషా సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు?
సయేషా సైగల్ పరిచయం అవసరం లేదు. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
సయేషా సైగల్ పరిచయం అవసరం లేదు. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడం తనని తీవ్రంగా నిరాశపరిచింది. నవతరం కథనాయికల గేమ్ ని ఓవర్ నైట్ లో మార్చేది కేవలం ఆ ఒక్క హిట్టు మాత్రమే. దానికోసం ఎంతో ఆశపడిన సయేషాకు అది ఊహించని షాక్. ఈ షాక్ తర్వాత ఇక తెలుగులో నటించేందుకు ప్రయత్నించలేదు సయేషా.
అటుపై సయేషా శివాయ్ (2016)తో బాలీవుడ్ లో ప్రవేశించింది. తర్వాత వనమగన్ (2017)తో తమిళ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. తన తెలుగు తమిళ డెబ్యూలకు ఉత్తమ తొలి నటిగా సైమా అవార్డులను అందుకుంది. కానీ ఇవేవీ తనకు కెరీర్ పరంగా కలిసి రాలేదు. తర్వాత కప్పాన్ (2019), యువరత్న (2021- తొలి కన్నడ చిత్రం) చిత్రాల్లో నటించింది. నిజానికి సయేషా సినీనేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. బాలీవుడ్ నటులు సుమీత్ సైగల్-షాహీన్ బానుల కుమార్తె. సయేషా వెటరన్ నటి సైరా బానుకి మనవరాలు.
ఆమె తల్లికి అత్త నసీమ్ బాను ముని మనవరాలు. సయేషా తన పాఠశాల విద్యను ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్, జుహూలో పూర్తి చేసింది. తన తల్లిదండ్రులు 2003లో విడాకులు తీసుకున్నారు. నటి ఫరా నాజ్ ఆమె సవతి తల్లి. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... గజినీకాంత్ (2019) చిత్రంలో నటించే సమయంలో సయేషా తమిళ నటుడు ఆర్యతో డేటింగ్ ప్రారంభించింది. ఈ జంట హైదరాబాద్‌లోని ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం 2019 మార్చి 10న వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె అరియానా 2021 జూలై 23న జన్మించింది. తమిళ నటుడు సత్య ఆమె బావ.
సయేషా-ఆర్య దంపతుల కుమార్తె బేబి అరియానాకు నాలుగు సంవత్సరాలు నిండాయి. సయేషా నిరంతరం తన భర్త కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోలను ఇంటర్నెట్ లో షేర్ చేస్తోంది. తాజాగా తన గారాల పట్టి అరియానాతో కలిసి ఉన్న ఓ ఫొటోని నెట్ లో షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది. మొదటి సారి నా బేబి స్విమ్మింగ్ పూల్ కి వచ్చింది అంటూ మురిపెంగా చెబుతోంది సయేషా. బేబి అరియానా అచ్చం తండ్రి ఆర్య పోలికతోనే క్యూట్‌గా ఉంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.