లక్నోలో రేడియోధార్మిక పదార్థం లీక్
అపస్మారక స్థితిలోకి ఇద్దరు 1.5 కిలోమీటర్లు ఖాలీ రంగంలోకి భారీ యెత్తున భద్రతా బలగాలు, శాస్ర్తవేత్తలు
లక్నో: లక్నో విమానాశ్రయంలో రేడియో ధార్మిక పదార్థం లీక్ అయింది. దీంతో పలువురు ఉద్యోగులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఏయిర్ పోర్టు సిబ్బంది, అధికారులు అప్రమత్తమైన 1.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకోగా విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
శాస్త్రవేత్తలు, ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. లక్నో నుంచి గౌహాతి వెళుతున్న విమానంలో ఓ చెక్కపెట్టేలో క్యాన్సర్ నివారణ మందుల ద్వారా రేడియోధార్మిక మూలకాలున్నట్లు గుర్తించారు. పెట్టెలో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించే సరికి ఈ పదార్థం లీక్ అయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనతో ఏయిర్ పోర్ట్ నుంచి పరుగులు తీశారు.