షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ
ప్రభుత్వం కమిటీలకే పరిమితమైన కాంగ్రెస్పార్టీ.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
నా తెలంగాణ, నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరిమితమైతే ప్రధాని నేతృత్వంలో ఫ్యాక్టరీని తెరిపించిన ఘనత బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్వింద్ తెలిపారు. జగిత్యాల మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను కాంగ్రెస్ విస్మరించిందని ధ్వజమెత్తారు. సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ నెల18వ తేదీన జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు.