సౌదీ–ఇరాన్​ లమధ్య ఉద్రిక్తతలు

జర్నలిస్టుల అరెస్టు విడుదలపై ఇరాన్​ విమర్శలు నిబంధనలు పాటించలేదన్న సౌదీ చైనా రాయబారానికి బీటలు

May 30, 2024 - 17:52
 0
సౌదీ–ఇరాన్​ లమధ్య ఉద్రిక్తతలు

రియాద్​: సౌదీ–ఇరాన్​ ల మధ్య మరోమారు ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల ఇరాన్​ జర్నలిస్టులను సౌదీ ప్రభుత్వం హజ్​ యాత్రకు అనుమతించకపోవడం వివాదానికి దారితీసింది. దీనిపై ఇరాన్​ ఆగ్రహం వ్యక్తం చేయగా దీనిపై సౌదీ ప్రభుత్వం గురువారం స్పందించింది. ఇరాన్​ జర్నలిస్టుల వీసాలు సౌదీ నిబంధలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించి వీరంతా పనిచేస్తున్నారని పేర్కొంది.  దీంతో వీరిని వెనక్కు పంపామని పేర్కొంది. ఇరాన్​ స్టేట్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌కు చెందిన ఆరుగురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించింది. అయితే వీరిని తిరిగి పంపేముందు వారంరోజులపాటు నిర్బంధించి విచారణ చేసిందని ఇరాన్​ ఆరోపిస్తోంది. 

చైనా మధ్యవర్తిత్వంలో గతంలో రియాద్​, టెహ్రాన్​ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇటీవలే ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతితో మరోమారు విభేదాలు బయటపడుతున్నాయి. 
ప్రపంచంలోని అతిపెద్ద షియా ముస్లిం దేశం ఇరాన్. సౌదీ సున్నీ ఆధిపత్య దేశం. సౌదీ అరేబియా ప్రముఖ షియా మత గురువు నిమ్ర్ అల్-నిమ్ర్‌ను ఉరితీసింది. సౌదీ దౌత్య కార్యాలయాలపై ఇరాన్​ దాడి దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో కూడా ఇరాన్​–సౌదీ మధ్య అనేకసార్లు విభేదాలు తలెత్తాయి.