సిఐటియూపై నిందలు.. ఊరుకునేది లేదు

There is no excuse for blaming CITU

Oct 24, 2024 - 21:02
 0
సిఐటియూపై నిందలు.. ఊరుకునేది లేదు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సిఐటియూపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర కార్యదర్శి సాంబార్ వెంకటస్వామి హెచ్చరించారు. వెంకటస్వామి గురువారం మీడియాతో మాట్లాడుతూ క్యాతన పల్లి మున్సిపాలిటీ 22వ కౌన్సిలర్ భర్త, ఓ యూట్యూబ్ న్యూస్ ప్రజెంటర్ తో కుమ్మక్కై పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిలర్ భర్త వార్డు అభివృద్ధి పనుల పేరిట ప్రజలను మభ్యపెడుతూ ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాను ఆనుకొని ఉన్న సింగరేణి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిఐటియు యూనియన్ పార్టీ, వ్యక్తులు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ వార్డు అభివృద్ధి పనులను అడ్డుకుంటుందని 22 వార్డు కౌన్సిలర్ భర్త అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. తమ పార్టీ అన్నివేళలా కార్మికుల సమస్యలపై, ప్రజల పక్షాన నిలబడి పట్టణ అభివృద్ధి కొరకు పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, ఆలవాల సంజీవ్, వెంకటేష్, శ్రీధర్ నవీన్ ఉన్నారు.