విఫలమైన చర్చలు- మునిసిపల్ సమ్మె యథాతథం
Failed Negotiations - Municipal strike status quo
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ మునిసిపల్ కార్మికులు తమకు వేతనాలు ప్రతినెలా చెల్లించాలని, ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు తొలగించాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు, మునిసిపల్ కమిషనర్ సి వి ఎన్ రాజు కు మధ్య చర్చలు శనివారం జరిగాయి. అయితే మునిసిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కారం కాలేదు. దీంతో సమ్మె కొనసాగించనున్నట్లు కార్మికులు వెల్లడించారు. సమస్యల పరిష్కారంపై కమిషనర్ తో చర్చలు జరిపినా అవి పరిష్కారానికి నోచుకోలేదని కార్మికులు వాపోయారు.