ప్రేమజంటలకు బెదిరింపులు కార్పొరేటర్ సోదరుడి హస్తం
ఎస్ ఐపై ఉన్నతాధికారుల ఆగ్రహం నిందితుల అరెస్ట్
నా తెలంగాణ, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లో స్థానిక కార్పొరేటర్ సోదరుడి ముఠా ప్రేమజంటను బెదిరించి రూ. 3 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఈ ప్రాంతంలో పోకిరీల ఆగడాలు శ్రుతిమించుతుండడంతో ఆ ప్రేమజంట స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా స్థానిక ఎస్సై పట్టించుకోలేదు. దీంతో బాధిత ప్రేమ జంట ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ ఐని డీసీపీ కార్యాలయానికి అటాట్ చేశారు. ఈ ప్రాంతంలో రాత్రివేళ వచ్చే జంటలను బెదిరిస్తూ మీ బండారం, ప్రేమ వ్యవహారం బయటపెడతామని బెదిరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అయితే స్థానిక ఎస్ ఐకి తెలిసే ఇదంతా జరుగుతోందని, స్థానిక నాయకుడి ప్రమేయం కూడా ఇందులో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విచారణ చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు నిందితులు అమర్, మారుతీ, ఉదయ్, రామ్ చరన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.