హిమాచల్​ ఖజానా ఖాళీ!

Himachal treasury is empty!

Nov 19, 2024 - 18:31
 0
హిమాచల్​ ఖజానా ఖాళీ!

ఉచిత పథకాలతో హస్తం గొప్పలు
ప్రభుత్వ ఆస్తులు, భవనాలు అమ్ముకుంటూ తిప్పలు
అదే దిశలో మరిన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: తెలంగాణ, ఏపీ, హిమాచల్​, కర్ణాటక, కేరళలో ఉచిత పథకాల భారంతో సతమతం అవుతున్నాయి. హిమాచల్​ ప్రదేశ్​ సీఎం సుఖ్వీందర్​ సింగ్​ సుఖు (కాంగ్రెస్​) ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించుకునేందుకు, గొప్పలకు పోయి తిప్పలకు గురవుతోంది. అక్కడి విద్యుత్​ సంస్థలకు బకాయిలు తీర్చేందుకు కూడా ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ భవనాలను వేలం వేసి అమ్ముకుంటోంది.  ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం తాహతుకు మించి అప్పులు చేసింది. ఇక అప్పులు పుట్టే మార్గం కూడా లేకపోవడం, రాష్​ర్టానికి వస్తున్న ఆదాయం కాస్త జీతాలకు కూడా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు, భవనాలను వేలం వేస్తూ ఉచితాల భారాన్ని మోస్తుంది. ఇదే దారిలో మరిన్ని కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలు పయనిస్తున్నాయి. ఫ్​రీబీస్​ పేరుతో ఇచ్చే ఉచితాలు ఏ దేశానికైనా, రాష్​ర్టానికైనా ప్రమాదకరమేనని హిమాచల్​ ప్రభుత్వం ఉచిత హామీలు మరోసారి ఋజువు చేశాయి.