డ్రగ్స్​ స్వాధీనం పాత నిందితుడి అరెస్ట్​

Old suspect arrested for possession of drugs

Jun 23, 2024 - 20:07
 0
డ్రగ్స్​ స్వాధీనం పాత నిందితుడి అరెస్ట్​

నా తెలంగాణ, హైదరాబాద్​: డ్రగ్స్​ పై పోలీసులు ఎంత పకడ్భందీ చర్యలు తీసుకున్నా స్మగ్లర్లు మాత్రం నూతన దారుల్లో డ్రగ్స్​ ను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆదివారం పోలీసుల మాదాపూర్​ లో తనిఖీలు చేపట్టగా బెంగుళూరు నుంచి హైదరాబాద్​ కు డ్రగ్స్​ ను తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి చిన్న చిన్న ప్యాకెట్లలో డ్రగ్స్​ ను చేసిప్రైవేట్​ బస్సుల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో నలుగురు డ్రగ్స్​ కొనుగోలుదారులను కూడా అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్​ పోలీసులు వెల్లడించారు. గతంలోనూ డ్రగ్స్​ కేసులో ఇదే నిందితుడిని పట్టుకున్నా బెయిల్​ పై వచ్చిన అతను తన తీరు మర్చుకోనట్లు తెలుస్తోంది. ఇతను 50 మంది వ్యాపారులకు డ్రగ్స ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.