విద్యుత్​ ఉద్యోగుల డీఏ పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన టీఎస్​ ట్రాన్స్​ కో

Jun 23, 2024 - 19:26
 0
విద్యుత్​ ఉద్యోగుల డీఏ పెంపు

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణ విద్యుత్​ ఉద్యోగుల డీఏను 11.78 శాతానికి పెంచుతూ టీఎస్​ ట్రాన్స్​  కో ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2024 జనవరి 1నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా గతంలో డీఏ 8.776 శాతంగా ఉండేది. డీఏ పెంపు వల్ల పెన్షనర్లకు కూడా పెంపుదల వర్తించనుంది.  2024 జనవరి-మే మధ్య కాలానికి పెరిగిన డీఏ బకాయిలను ఉద్యోగులు, ఆర్జిజన్లు, పెన్షనర్లకు 11 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ట్రాన్స్​ కో స్పష్టం చేసింది. జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్సీ డీసీఎల్ సంస్థలు సైతం తమ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.