సగానికి తగ్గిన శిశు మరణాల రేటు

Infant mortality rate halved

Sep 5, 2024 - 16:05
 0
సగానికి తగ్గిన శిశు మరణాల రేటు
స్వచ్ఛత అభియాన్​, మరుగుదొడ్ల నిర్మాణమే కారణం
ఇండియన్​ మెడికల్​ రీసెర్చ్​ అధ్యయనంలో వెల్లడి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్​ మిషన్, మాతా, శిశు మరణాలను తగ్గించడంలో మరుగుదొడ్డి నిర్మాణాలు కీలక పాత్ర పోషించాయని, దీంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఐఎంఆర్​ (ఇండియన్​ మెడికల్​ రీసెర్చ్​) వెల్లడించింది. గురువారం 2014–2020ల మధ్య చేపట్టిన ఓ అధ్యయనం  ప్రకటనను ఐఎంఆర్​ విడుదల చేసింది. 
 
ఈ ఆరు సంవత్సరాల్లో 1000 జననాలకు 60 శిశు మరణాల రేటు ఉందని పేర్కొంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో స్వచ్ఛత అభియాన్​ ప్రారంభం, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడంలో ఈ మరణాల రేటు సగం కంటే తక్కువగా ఉందని తెలిపింది. 2020 నుంచి 2023 వరకు శిశుమరణాలు 30కంటే తగ్గాయని నివేదిక బహిర్గతం చేసింది. ప్రజారోగ్యంపై స్వచ్ఛత అభియాన్​ ద్వారా పారిశుధ్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో క్రమేణా శిశు మరణాల రేటును ప్రతీయేటా భారీగా తగ్గుతోందని తెలిపింది. 
 
మాతా శిశు మరణాలను తగ్గించేందుకు మారుమూల, సరిహద్దు చివర గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛతా అభియాన్​ కొనసాగుతోంది. దీంతో రానున్న సమయంలో ఈ సంఖ్య మరింత తగ్గుతోందని పేర్కొంది. అదే సమయంలో ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు వైద్యసౌకర్యాలను కూడా పటిష్ఠం చేయడంలో శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గిందని ఐఎంఆర్​ చేపట్టిన ఆ అధ్యయనంలో తేలింది.