మాజీ సీఎం చౌతాలా కన్నుమూత
Former CM Chautala passed away
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ ఎల్ డీ (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. గురుగ్రామ్ మేదాంతలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత మూడు నాలుగేళ్లుగా వృద్ధ్యాపం, అనారోగ్య సమస్యలతో చౌతాలా బాధపడుతున్నారు. ఆయన మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఓం ప్రకాష్ చౌతాలా 1935 జనవరి 1న సిర్సాలోని చౌతాలా గ్రామంలో జన్మించారు . చౌతాలా ఐదుసార్లు హరియాణాకు సీఎంగా ఉన్నారు. 1989 డిసెంబర్ 2న చౌతాలా తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. చౌతాలా మృతి పట్ల సీఎం సైనీ సంతాపం వ్యక్తం చేశారు. చౌతాలా 82 యేళ్లలో పదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యారు. ఓం ప్రకాశ్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.