గుడుంబా పై పోలీసుల ఉక్కుపాదం

ఏకకాలంలో దాడులు ఎస్పీ హెచ్చరికలు

Jul 19, 2024 - 15:57
 0
గుడుంబా పై పోలీసుల ఉక్కుపాదం

నా తెలంగాణ, డోర్నకల్: గుడుంబా స్థావరాలపై మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొంతకాలంగా అవగాహన కల్పిస్తున్నా, దాడులు నిర్వహిస్తున్న మార్పు లేకపోవడంతో ఇక ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలు చోట్ల గుడుంబా తయారీకి విక్రయించే అక్రమ పట్టిక, బెల్లంలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా మహమ్మారి వల్ల ఎన్నో జీవితాలు చెల్లాచెదురై పోతున్నాయని అన్నారు. అనేక ఘర్షణలకు గుడుంబా కారణమవుతోందన్నారు. దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ప్రాణాలు తీసే ఈ మహమ్మారిని పూర్తి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ రాంనాథ్​ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అమ్మకం దారులు గుడుంబాను అమ్మడం పూర్తిగా మానేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా స్వాధీనం చేసుకున్న నిందితులను అరెస్టు చేసి వారికి కౌన్సిలింగ్​ నిర్వహించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.