విజయానికి అందరూ అర్హులే అపజయానికి బాధ్యులు ఒక్కరే!
ఓటమికి కారణాలు విశ్లేషిస్తాం తనపనితీరుపై షా సంతృప్తి మహారాష్ర్ట డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
ముంబై: విజయం సాధిస్తే అందరూ అర్హులవుతారని, కానీ అపజయానికి ఒక్కరినే బాధ్యులను చేస్తారని మహారాష్ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శనివారం ఆయన ముంబైలో తమ పార్టీప్రదర్శన, రాజీనామాలపై మాట్లాడారు. శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా ఫడ్నవీస్ భేటీ అయిన విషయం తెలిసిందే. మహారాష్ర్టలో బీజేపీ విజయానికి తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. అయినా తాను నిరాశ చెందబోనని తెలిపారు. శివసేన (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేపై కూడా విమర్శలు చేశారు. కేంద్రమంత్రి అమిత్ షాతో తన భేటీలో పదవిలో కొనసాగాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఓటమికి కారణాలను విశ్లేషించాల్సిన బాధ్యత తనపై ఉంచారని తెలిపారు. రానున్న సమయంలో బీజేపీ విజయానికి కృషి చేయాలని తన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.