ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు
ఎన్ఎస్ఏ సమావేశంలో అజిత్ దోవల్
సెయింట్ పీటర్స్‌బర్గ్: ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. బుధవారం రష్యా పర్యటనలో ఉన్న ఆయన సెయింట్ పీటర్స్ బర్గ్ లో బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆధునిక భద్రతతో సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఆవశ్యత ఉందని నొక్కి చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపునకే ఈ భేటీ నిర్వహించారు. ఇందులో భారత్ విధానం స్పష్టంగా ఉందన్నారు. ఇరుదేశాలు శాంతి చర్చలను ప్రారంభించాలని దోవల్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ లో బ్రిక్స్ సదస్సుకు ముందు ఈ సమావేశం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.