దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి-కుమార్ దీపక్
Scrutiny of applications should be expedited-Kumar Deepak
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటి కార్యాలయన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. పాలనాధికారి కుమార్ దీపక్ మాట్లాడుతూ పురపాలకంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల ద్వారా లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని పుర కమిషనర్ ను సూచించారు. అధికారులు అర్హులైన లబ్ధిదా రులకు సంక్షేమ ఫలాలు అందే విదంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం మున్సిపలిటి లోని నర్సరీని సందర్శించారు. 20వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుర చైర్మన్ జంగం కళ, కమిషనర్ మురళి కృష్ణ పాల్గొన్నారు.