స్విట్జర్లాండ్ లో బురఖాపై నిషేధం అమలు!
Implementation of the ban on the burqa in Switzerland!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్విట్జర్లాండ్ లో నేటి నుంచి (బుధవారం 2025 జనవరి 1) బురఖాపై నిషేధం వర్తించనుంది. ఉల్లంఘనలకు రూ. 96వేల జరిమానా విధించనున్నారు. దీంతో బురఖాను నిషేధించిన ఏడో యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఈ దేశంలో ముస్లిం మహిళలు ముఖాలను పూర్తిగా కప్పి ఉంచడంపై నిషేధం విధించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంక్ లు (రూ. 96వేలు) జరిమానా విధించనున్నారు. 2021లో ప్రజాభిప్రాయ సేకరణలో 51.21 శాతం మంది పౌరులు బురఖా నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. అటు పిమ్మట చట్టాన్ని చేశారు. స్విట్జర్లాండ్ కంటే ముందు బురఖాపై నిషేధం విధించిన దేశాల్లో బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బల్గేరియాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రజాసమ్మర్థ ప్రాంతాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, రెస్టారెంట్లు, షాపులు, ఇతర ప్రదేశాలలో మహిళలు తమ ముఖాలను పూర్తిగా కప్పుకోలేరు.