కేజ్రీవాల్ మోసాలపై ప్రతిజ్ఞ చేస్తారా?
బీజేపీ సచ్ దేవా బహిరంగ లేఖ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎన్నికలకు ముందు ఆప్ పార్టీపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆరోపణలు, విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అసత్యాలు, మోసాలకు దూరంగా ఉంటూ సుభిక్ష పాలనను తీసుకురావాలని అన్నారు. బుధవారం నూతన సంవత్సరం తొలిరోజున కేజ్రీవాల్ కు బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం, దీర్ఘాయువు కలిగిఉండాలని ఆకాంక్షించారు. పాలనలో అర్థవంతమైన మార్పులను తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారని వారి అభ్యర్థనల మేరకు పాలన కొనసాగించాలన్నారు.
అవినీతిపై పిల్లలపై ప్రమాణం చేయాలని, అలా అసత్య ప్రమాణం చేయరని నమ్ముతున్నట్లుగా తెలిపారు. మహిళలు, పెద్దలు, మతస్థుల మనోభావాలతో ఆడుకోవడం మానేయాలన్నారు. మద్యాన్ని ప్రోత్సహించినందుకు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. తప్పుడు హామీలు, యమునా పరిశుభ్రత పేరుతో చేసిన అవినీతి క్షమించరాని నేరానికి మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. దేశ వ్యతిరేక శక్తులను కలవబోమని, రాజకీయ ప్రయోజనాల కోసం విరాళాలు స్వీకరించబోమని కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేయాలని వీరేంద్ర సచ్ దేవా లేఖలో డిమాండ్ చేశారు.