మోదీ అధ్యక్షతన కేబినెట్​ భేటీ

Cabinet meeting chaired by Modi

Jan 1, 2025 - 14:29
 0
మోదీ అధ్యక్షతన కేబినెట్​ భేటీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రమంత్రిమండలి భేటీ అయ్యింది. 2025 నూతన సంవత్సరం బుధవారం తొలి క్యాబినెట్​ భేటీ కావడం విశేషం. ఈ భేటీలో ఢిల్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నిధులు, పథకాల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. అదే సమయంలో ఎన్డీయే మిత్ర పక్షాల విజ్ఞప్తులు, కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. నూతన సంవత్సర కానుకను మోదీ ప్రభుత్వం అందజేయనుంది. ఉదయం నుంచి ప్రధాని మోదీ నివాసంలోనే క్యాబినెట్​ భేటీ జరుగుతుంది. పంజాబ్​ రైతుల ఉద్యమం నేపథ్యంలో రైతుల సంక్షేమానికి డీఏపీపై రూ. 150 నుంచి రూ. 200 ల వరకు పెంచే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వంపై కాగ్​ రిపోర్ట్​ పై చర్చించనున్నారు.