మూడు రకాల అకౌంట్లు క్లోజ్​

ఆర్బీఐ ఆదేశం, చర్యలకు బ్యాంకులు సిద్ధం

Jan 1, 2025 - 14:06
 0
మూడు రకాల అకౌంట్లు క్లోజ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్బీఐ ఆదేశాల మేరకు 2025 జనవరి 1వ తేదీ నుంచి మూడు రకాల అకౌంట్లను బ్యాంకులు క్లోజ్​ చేయనున్నాయి. బుధవారం నుంచే బ్యాంకులు ఈ చర్యలను చేపట్టనున్నాయి. యేడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాలు, చాలా కాలంగా జీరో బ్యాలెన్స్​ ఉన్న ఖాతాలు ఎలాంటి లావాదేవీలు నిర్వహించని, రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఇతర ఖాతాలను కూడా మూసివేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. ఇలాంటి ఖాతాల ద్వారా సైబర్​ మోసాలు జరిగే ఆస్కారం ఉండడంతో ఈ చర్యను తీసుకుంది. అమితే ఇలాంటి ఖాతాలు తిరిగి పనిచేయాలంటే ఖాతాదారులు సంబంధిత పత్రాలతో బ్యాంకును సంప్రదించి యాక్టివ్​ చేసుకోవచ్చు.