ఇస్రో మరో అరుదైన ఘనత పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవతం
Another rare feat of ISRO is the successful launch of PSLV C-60
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం సక్సెస్ అయింది. సోమవారం (డిసెంబర్ 30) రాత్రి 10 గంటల 15 సెకన్ల సమయంలో స్పేడెక్స్ ను ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తొలుత సోమవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉనా, 20 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగం విజయవంతం అవడం పట్ల ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు.
పీఎస్ ఎల్ వీసీ–60 స్పాడెక్స్ రెండు ఉపగ్రహాలును విజయవతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్ఇంది. 24 పేలోడ్ లు స్టార్టప్‌లు, ఇస్రో అనుబంధ సంస్థలు తయారుచేసిన ఈ పేలోడ్‌లను శాస్త్రవేత్తలు రాకెట్‌లోని నాల్గవ దశ (టాప్)లో అమర్చారు. పీఎస్4 -ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ వలె పని చేస్తున్న ఈ భాగం కొన్ని వారాల్లో భూమిపైకి రానుంది. ఈ నిర్ణీత వ్యవధిలో పేలోడ్‌లు నిర్దిష్ట ప్రయోగాలు చేసేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది.