పారిస్​ ఒలింపిక్స్​ కు 117 మంది

117 people for Paris Olympics

Jul 19, 2024 - 15:22
 0
పారిస్​ ఒలింపిక్స్​ కు 117 మంది

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒలింపిక్స్​ కు 117 మంది ఆటగాళ్ల బృందాన్ని పంపించేందుకు భారత్​ నిర్ణయించింది. జూలై 26 నుంచి ఆగస్ట్​ వరకు ఒలింపిక్స్​ క్రీడలు పారిస్​ లో జరగనున్నాయి. ఈ సభ్యులను బుధవారమే ప్రకటించినప్పటికీ ఏయే ఆటల నుంచి ఎంతమంది వెళ్లనున్నారనే విషయం శుక్రవారం స్పష్టం చేసింది. వీరికి సహాయకులుగా 140 మంది వెళ్లనున్నారు. 
ఏయే విభాగాలు..
ఎథ్లెటిక్స్​ 29, బ్యాడ్మింటన్​ 7, టేబుల్​ టెన్నిస్​ 8, షూటింగ్​ విభాగం 21, హాకీ 19మంది వెళ్లనున్నారు. ఎథ్లెటిక్స్​లో 18మంది పురుషులు, 11 మంది మహిళలు, హాకీలో 19మంది, షూటింగ్​ విభాగంలో పది మంది పురుషులు, 11 మంది మహిళలు, కుస్తీలో ఒక పురుషుడు, ఐదుగురు మహిళలు, బాక్సింగ్​ లో పురుషులు 2, మహిళలు 3, బ్యాడ్మింటన్​ లో పురుషులు 4, మహిళలు 3, ఆర్చరీ విభాగంలో పురుషులు 3, మహిళలు 3, గుర్రపు పందెం పురుషుడు 1, జూడోలో మహిళ 1, రోయింగ్​ లో 1 పురుషుడు, సెయిలింగ్ పురుషులు 2, స్విమ్మింగ్​ లో 1 మహిళ, 1 పురుషుడు, టేబుల్​ టెన్నిస్​ లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు రిజర్వ్​ ఆటగాళ్లు, వెయిట్​ లిఫ్టింగ్​ లో ఒక మహిళ, టెన్నిస్​ పురుషులు ముగ్గురు, గోల్ఫ్​ పురుషులు ఇద్దరు, మహిళలు ఇద్దరు.