మన్ కీ బాత్ సూచనలకు ప్రధాని ఆహ్వానం
Prime Minister's invitation to Mann Ki Baat instructions
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ పైసూచనలు, సలహాలను ఆహ్వానించారు. యువత సమాజాన్ని మార్చే లక్ష్యంతో సమిష్టిగా పనిచేయాలని శుక్రవారం తెలిపారు. పలు రంగాల్లో యువత చేస్తున్న కృషిపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. జూలై 28న ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కోసం దేశ ప్రజల విలువైన సూచనలను నమో యాప్ ద్వారా అందజేయవచ్చన్నారు. మీ సందేశాలను నమో యాప్ తోపాటు 1800–11–7800 లో సందేశాన్ని నమోదు చేసుకోవచ్చని, మై గవర్నమెంట్ యాప్ లో పంచుకోవచ్చన్నారు.