కంప్యూటర్​ సెంటర్​ లో మంటలు

చిక్కుకున్న విద్యార్థులు సహాయక చర్యల్లో పోలీసులు,అగ్నిమాపక శాఖ

May 18, 2024 - 19:28
 0
కంప్యూటర్​ సెంటర్​ లో మంటలు

డిస్ఫూర్​: అస్సాంలోని సిల్చార్​ లో ఓ కంప్యూటర్​ సెంటర్​ లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలంటుకోవడంతో స్థానికులు కూడా మంటలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. పై అంతస్థులు కంప్యూటర్​ సెంటర్​ ఉండడంతో నీటి కొరత వల్ల మంటలను స్థానికులు ఆర్పలేకపోయినట్లు పలువురు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కాగా కంప్యూటర్​ సెంటర్​ లో ఏదో పేలుడు శబ్దం వినిపించిందని అనంతరం మంటలు చెలరేగాయన్నారు. సెంటర్​ లో కొంతమంది విద్యార్థులున్నట్లుగా పేర్కొన్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు.