బోనస్ నేరుగా జమచేయాలి
Bonus must be deposited directly
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణిలో కార్మికులకు 33శాతం లాభాల వాటాతో కాంట్రాక్ట్ కార్మికులు రూ.5వేల చొప్పున బోనస్ ప్రకటించడంపై సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దులం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఆర్కే ఉపరితల గని కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారికి మోమరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓసిల్లో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లకు సింగరేణి యాజమాన్యం లాభాల వాటాను నేరుగా డ్రైవర్ల ఖాతాలో చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోమరాండం అందించిన వారిలో ఉపరితల గని డ్రైవర్లు పాల్గొన్నారు.