మద్యం కుంభకోణం ఈడీ విచారణకు ఎల్జీ ఆమోదం

LG approves ED probe in liquor scam

Dec 21, 2024 - 13:40
 0
మద్యం కుంభకోణం ఈడీ విచారణకు ఎల్జీ ఆమోదం

కేజ్రీవాల్​ కు పెరగనున్న కష్టాలు

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు పెరిగాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో కేజ్రీవాల్​ ను విచారించేందుకు ఎల్జీ వీకే సక్సేనా ఈడీకి ఆమోదం తెలిపారు శనివారం ఈడీ విచారణకు ఎల్జీ ఆమోదముద్ర వేశారు. ఈడీ మార్చి 21న కేజ్రీవాల్​ ను అరెస్టు చేసింది. మేలో చార్జీ షీట్​ కూడా దాఖలు చేసింది. ఛార్జిషీట్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ ప్రధాన సూత్రధారి అని, ఈయనతోపాటు మనీష్ సిసోడియాలను స్కాం సూత్రధారులుగా పేర్కొంది. సౌత్ లాబీకి సహాయం చేయడానికి కేజ్రీవాల్, సిసోడియా ఎక్సైజ్ పాలసీ 2021–-22లో మార్పులు చేశారని, ఇందులో రూ. 100 కోట్లు లంచం చెల్లించారని ఆరోపించిన ఏజెన్సీ పేర్కొంది. రూ. 100 కోట్ల రూపాయల లంచంలో, ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రూ.45 కోట్లను ఖర్చుచేసిందని ఈడీ ఆరోపిస్తుంది.