కజాన్ లో డ్రోన్లతో భారీ దాడులు
Heavy drone attacks in Kazan
ఉక్రెయిన్ దాడుల్లో వాణిజ్య భవనాలకు భారీ నష్టం
50 డ్రోన్లతో దాడి, ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
పాఠశాలలు, కళాశాలలు మూసివేత
మాస్కో: రష్యా కజాన్ లో ఉక్రెయిన్ 50 డ్రోన్ బాంబులతో విరుచుకుపడింది. దీంతో మూడు వాణిజ్యభవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం ఆరు భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. శనివారం ఉదయం ఉక్రెయిన్ ఈ దాడులను చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. కజాన్ లో ఎమర్జెన్సీ విధించింది. ఆకాశమార్గంలో డ్రోన్లను వెంటనే పేల్చివేయాలని ఆదేశించింది. కజాన్ నగర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని, ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని హెచ్చరించింది. వాణిజ్య భవంతులపై 9/11 తరహా దాడులు జరగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు చాలా డ్రోన్ లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కజాన్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ విధించారు. విమానాశ్రయాన్ని మూసివేసి నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లను మూసివేశారు. ఉక్రెయిన్–రష్యాలు శాంతికి, చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా ఇరుదేశాధ్యక్షులు దాడుల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం ప్రపంచదేశాలను కలవరపరుస్తుంది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో 8 డ్రోన్లు అనేక నగరాల్లోని వాణిజ్య భవనాలపై దాడులకు పాల్పడ్డాయి.